అర్ధరాత్రి ఆస్పత్రిలో అనుమానాస్పదంగా ఇద్దరు యువకులు - చితకబాదిన రోగులు - Kurnool Government Hospital - KURNOOL GOVERNMENT HOSPITAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 12:40 PM IST
Two Young Men Suspiciously Wandering Around Hospital : కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పేషంట్ల బంధువులు చితకబాదారు. చిన్నపిల్లల ప్రసూతి విభాగం వద్ద ఇద్దరు యువకులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వీడియోలు తీసుకుంటూ రోగుల బంధువుల కంటపడ్డారు. వారిపై అనుమానం వచ్చి చిన్న పిల్లలు, మహిళలు ఉన్న వార్డులో మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పిల్లలను ఎత్తుకు పోయేందుకు వచ్చారా అని అక్కడున్న వారు యువకులకు దేహశుద్ధి చేశారు.
Kurnool District : ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి హుటహుటిన బయలుదేరారు. ఆసుపత్రికి చేరుకుని యువకుల ఇద్దరిని 3వ పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. ఇద్దరి యువకులను పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రైవేటు ల్యాబ్లో పని చేస్తున్నట్లు పోలీసులకు తెలియజేశారు. రోగులకు బ్లడ్ శాంపిల్స్ చేసేందుకు వచ్చిన్నట్లు యువకులు తెలిపారు. అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చారని పోలీసులు విచారిస్తున్నారు.