వేగంగా దూసుకొచ్చిన కారు- క్షణాల్లో తల్లీకూతురు దుర్మరణం - కారు ఢీకొని ఇద్దరు మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 1:44 PM IST
Two people Died in road accidents in Kurnool District : కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురం వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొని తల్లి, కుమార్తె మృతిచెందారు. జయలక్ష్మి (35) మరిది కుమార్తె రాజేశ్వరిని (6) తీసుకొని పొలానికి వెళ్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కారు పొలాల్లోకి దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయింది. ఒకే ఇంట్లో ఇద్దరి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Two people Died in car Accident : వారిద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జాతీయ రహదారిపై అతి వేగంతో వెళ్తున్న కారు, పొలానికి వెళ్తున్న వీరిపైకి దూసుకొచ్చింది. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందిన వారిని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా అసలు కారు ఎవరిది, డ్రైవర్ ఎవరు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.