మహిళల వేషధారణలో వచ్చి చోరీ - 4 తులాల బంగారం, రూ.లక్షతో పరార్ - theft in Sr nagar - THEFT IN SR NAGAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 20, 2024, 2:23 PM IST

Two Men Came Lady Costume and Committed Theft In SR Nagar : హైదరాబాద్‌లో దొంగలు తెగబడుతున్నారు. మహిళల వేషధారణలో వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి పాల్పడ్డారు. ఎస్సార్​ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రైవేటు ఉద్యోగి కె.వెంకటేశ్వర్రావు నివాసముంటున్నారు.  16వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఒంగోలు వెళ్లారు. 18వ తేదీ శనివారం ఉదయం ఇంటి పనిమనిషి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగల గొట్టి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈనెల 18వ తేదీ తెల్లవారుజామున ఇద్దరు దుండగులు మహిళల వేషధారణలో ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. అపార్టుమెంట్‌లోని ఇంట్లోకి చొరబడి అల్మారాలో దాచిన 4 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు, ఓ ల్యాప్‌టాప్  దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు వేసవి సెలవులు కావడంతో చాలామంది వెకేషన్స్​కు వెళుతుంటారు. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుచరులకు చెప్పడమో, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెకేషన్స్​కు వెళ్లడం మంచిదని సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.