హారన్ కొట్టాడని బస్టాండుకు వచ్చి ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి - Attack on RTC Bus Driver - ATTACK ON RTC BUS DRIVER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 4:05 PM IST
Two Men Attacked an RTC Driver in Krishna District : ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో నెలకొంది. బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడని బస్టాండుకు వచ్చి మరీ డ్రైవర్‌పై దాడి చేశారు. అవనిగడ్డ డిపోకు చెందిన బస్సు గుడివాడ బస్టాండు సమీపంలోని కిన్నెర కాంప్లెక్స్ వద్దకు వచ్చింది. అక్కడ రోడ్డు మధ్యలో కారు నిలపి ఉంది. ముందుకు వెళ్లడానికి దారి లేకపోవడంతో కారు పక్కకు జరగటం కోసం బస్సు డ్రైవర్ రాకేష్ హారన్ కొట్టాడు.
హారన్ కొట్టాడని తీవ్ర ఆగ్రహంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అసభ్య పదజాలంతో దూషిస్తూ బస్సు డ్రైవర్ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కొంత మంది ఆర్టీసీ ఉద్యోగులు దాడి ఆపే ప్రయత్నం చేసిన వారు పట్టించుకోలేదు. ఘటనపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వెంటనే రంగలోకి దిగిన పోలీసులు డ్రైవర్‌పై దాడి చేసిన వారు బేతవోలుకు చెందిన శ్రీనివాస్, ముభారక్ సెంటర్‌కి చెందిన శివ వెంటక నాగేద్రంగా గుర్తించారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.