చైనాలో ఆసియా క్రీడలు- రాష్ట్రం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపిక - Asia Junior Badminton Championship - ASIA JUNIOR BADMINTON CHAMPIONSHIP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 7:51 PM IST
Two players selected for Asia Junior Badminton Championship: ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చైనాలోని ఛెంగ్లో జరగనున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్కి ఏపీకి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి అంకమ్మ చౌదరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కండ్రవు దుర్గా ఇషా, విశాఖకు చెందిన కడపాకుల రాహుల్ ఎంపికయ్యారన్నారు. భారత్ జట్టుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన షట్లర్ తలశిల టంకార జ్ఞానదత్ సారథ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ క్రీడల్లో వీరిద్దరు విజయం సాధించాలని అంకమ్మ చౌదరి ఆకాంక్షించారు.
"చైనాలోని ఛెంగ్లో జరగనున్న ఆసియా క్రీడలకు రాష్ట్రం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. రాజమండ్రికి చెందిన కండ్రవు దుర్గా ఇషా, విశాఖకు చెందిన కడపాకుల రాహుల్ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్కి సెలక్టయ్యారు. వీరిద్దరూ ఈ పోటీల్లో విజయం సాధించాలని కోరుతున్నాను." - అంకమ్మ చౌదరి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి