చెట్లు నరికేయడం - దుకాణాలు తొలగిస్తున్నారంటే 'అన్నొస్తున్నట్లే' - CM Jagan Tour Trees Cuts - CM JAGAN TOUR TREES CUTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 7:40 AM IST
Trees Cutting Due to CM Jagan Tour in Rajamahendravaram : ఇవాళ సీఎం జగన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం రోడ్ షో జరగనున్న రాజమహేంద్రవరంలోని పలుచోట్ల పచ్చని చెట్ల కొమ్మలను నరికేశారు. రహదారికి ఇరువైపులా అడ్డుగా ఉన్న వ్యాపార దుకాణాల నిర్మాణాలను తొలగించారు. జాంపేట, ఆజాద్ చౌక్‌లలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన హలీమ్ దుకాణాలను తొలగించారు.
ఎన్నికల కోడ్ వచ్చే కొద్ది రోజుల ముందు అభివృద్ధి పేరిట నగరంలో పలుచోట్ల రహదారులను ధ్వంసం చేసిన యంత్రాంగం ఇన్నాళ్లూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం పర్యటన నేపథ్యంలో హడావుడి చేస్తున్నారు. గోకవరం బస్టాండ్, నగరపాలకసంస్థ కార్యాలయం రోడ్డులో డివైడర్, మురుగు కాల్వ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో వాటిని పూడ్చివేశారు. మరోవైపు దీర్ఘకాలంగా అసంపూర్తిగా ఉన్న సుందరీకరణ పనులు, వీధి దీపాల మరమ్మతులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.