'మా వంతు అయిపోయింది - ఇక మీ వంతే మిగిలింది' - ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్స్ - TRANSGENDERS CAST VOTES in ts - TRANSGENDERS CAST VOTES IN TS
🎬 Watch Now: Feature Video
Published : May 13, 2024, 12:55 PM IST
Transgenders Cast Their Vote in Nalgonda 2024 : రాష్ట్రంలో ఓట్ల కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని, తమ అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.
ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని బోయవాడ పోలింగ్ కేంద్రంలో అందరి కంటే ముందు వచ్చి ట్రాన్స్‌జెండర్స్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ట్రాన్స్‌జెండర్స్ అంటున్నారు. పోలింగ్ రోజు సెలవు దినంలా కాకుండా పండుగ దినంగా జరుపుకోవాలని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయడం చాలా ఆనందంగా ఉందని, సరైన నాయకుడిని ఎంచుకునే అవకాశం ఇదని వివరిస్తున్నారు. తమకు అధికారులు ఓటు హక్కు కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'మా వంతు అయిపోయింది, ఇక మీ వంతే మిగిలింది' అంటూ ట్రాన్స్‌జెండర్స్ సందేశమిస్తున్నారు.