కదులుతున్న రైలు డోర్ హ్యాండిల్ ఊడిపోయి ట్రైన్ గార్డుకు గాయాలు - Train Guard Fell From Moving Train - TRAIN GUARD FELL FROM MOVING TRAIN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 3:51 PM IST
Train Guard Fell From Moving Train Near By Samarlakota Railway Station : కదులుతున్న ట్రైన్ నుంచి రైలు గార్డు జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళ్తున్న రైలు డోర్ హ్యాండిల్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలుపుతున్నారు. ఈ క్రమంలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తు కింద పడ్డారు. ఘటనలో గార్డుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు దుర్గాప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించారు. రైలు గార్డు దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యశ్వంత్ పూర్ హౌరా రైలులో మరో గార్డు విధులు కేటాయించేందుకు గంటపాటు నిలిపివేశారు. ప్రస్థుతం దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హ్యాండిల్ విరిగి ఇలా ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోనలకు గురయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సిబ్బంది వెల్లడించారు.