మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్‌బంద్ - Bharat Bandh 2024 Today
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 1:25 PM IST
Bharat Bandh in AP : కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల కార్మిక సంఘాలు భారత్‌బంద్ చేపట్టాయి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ.కొండాపురంలో బంద్‌కు మద్దతుగా అనంతపురం-తాడిపత్రి జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నంద్యాల జిల్లా డోన్‌లో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్‌లో నిర్హహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఏలూరులో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, రైతు వ్యతిరేక చట్టాలు పూర్తిగా రద్దు చేయాలని, రైతాంగం పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో వాహనాల ర్యాలీ నిర్వహించారు. పాడేరులో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.