వంజంగి ప్రకృతి అందాలు - పోటెత్తిన పర్యాటకులు - Tourists in Vanjangi hills
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 12:43 PM IST
Tourists in Vanjangi Hills : అల్లూరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. వంజంగి పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతోంది. వంజంగి కొండలపై శ్వేతవర్ణ సోయగాలు ఆకట్టుకుంటున్నాయి. ఉదయభానుడి లేలేత కిరణాలు తాకినవేళ వెండిమబ్బుల అందాలు చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలకు వంజంగి కొండలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అంతే కాకుండా అక్కడ ఉన్న సహజసిద్ధమైన అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి ప్రేమికులు మైమరిచిపోతున్నారు. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతూ ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి వంజంగి కొండలు.
Vanjangi Hills at Paderu : ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి పర్యటకులు వంజంగి కొండల్లో సేద తీరడానికి అధిక సంఖ్యలో తరిలివచ్చారు. వంజంగి కొండపై సుర్యోదయపు వేళలో అందాలు ఊహాతీతంగా ఉన్నాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన మేఘాల కొండల్లో పర్యాటకులు విహరించారు. అలాగే ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ప్రకృతి ఇచ్చే స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ అలా కొద్దిసేపు ఆ కొండల్లో ప్రకృతి ప్రేమికులు సేద తీరారు. అటు వైపుగా వెళ్లిన వారు తమ సెల్ ఫోన్లో ప్రకృతి అందాలను బంధిస్తున్నారు.