వాహనదారుడిపై టోల్ సిబ్బంది దాడి - తాడ్దాన్‌పల్లి వద్ద ఉద్రిక్తత - Toll Plaza Staff Attack on Motorist - TOLL PLAZA STAFF ATTACK ON MOTORIST
🎬 Watch Now: Feature Video
Published : Jun 16, 2024, 12:02 PM IST
Taddanpally Toll Plaza Staff Attack on Motorist : సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చౌటకూర్ మండల పరిధిలోని నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై ఉన్న తాడ్దాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద ఘర్షణ నెలకొంది. వాహన టోల్ రుసుం చెల్లింపుపై ఓ వాహనదారుడికి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. స్థానిక వాహనాలకు కూడా డబ్బులు చెల్లించడం ఏంటని బాధితుడు అడగగా, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే పరస్పరం ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వాహనదారుడిపై టోల్‌ప్లాజా సిబ్బంది ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా స్థానిక వాహనాలకు కూడా టోల్ రుసుం వసూలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.