ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు: తిరుపతి కలెక్టర్ - Tirupati Collector Media conference - TIRUPATI COLLECTOR MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2024, 1:38 PM IST
Tirupati Collector on Elections Arrangements: పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తిరుపతి కలెక్టర్, ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2వేల 140 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అన్నింట్లోనూ సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్లలోకి అనుమతించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లాలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు.
"తిరుపతి జిల్లాలో మొత్తం 2,140 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అన్నింట్లోనూ సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుకు ఆదేశించాం. మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్లలోకి అనుమతించబోం. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు." - ప్రవీణ్ కుమార్, తిరుపతి కలెక్టర్