తిరుపతి, చంద్రగిరి అత్యంత సమస్యాత్మకమైనవి-పటిష్ట చర్యలు తీసుకున్నాం: కలెక్టర్ ప్రవీణ్ కుమార్ - Collector Praveen Kumar Interview - COLLECTOR PRAVEEN KUMAR INTERVIEW
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2024, 10:09 PM IST
Tirupati Collector Praveen Kumar Interview: అత్యంత సమస్యాత్మకమైన తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని తిరుపతి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, దొంగ ఓట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ భద్రత ఏర్పాటు చేశామని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెబుతున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో వంద శాతం పోలింగ్ జరిపించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. బోగస్ ఓటింగ్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేశామని ఇప్పటివరకు 85,000 అస్పష్టమైన ఓట్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎవరైనా దొంగ ఓట్లకు పాల్పడితే వెంటనే ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు.