స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ భద్రత - పరిశీలించిన జిల్లా అధికారులు - EVM Strong Room - EVM STRONG ROOM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 12:51 PM IST
Tight Security at EVM Strong Room : ఈవీఎంలు (EVM) భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో మూడంచల పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు మరొక రెండు రోజులలో పూర్తి అవుతాయని పేర్కొన్నారు
Officials Inspected Strong Rooms : నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆర్జీఎం (RGM) శాంతిరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కళాశాల రహదారిలో వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపించాలని సిబ్బందికి సూచించారు.