ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సహా మహిళా కండక్టర్‌పై యువకుల దాడి - వీడియో వైరల్​ - Attack on RTC Bus Driver in Hyd - ATTACK ON RTC BUS DRIVER IN HYD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 1:19 PM IST

Youth attack on RTC Bus Driver in Hyderabad : హైదరాబాద్‌ బేగంబజార్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్​పై ముగ్గురు యువకులు దాడి చేశారు. బస్సు దిల్‌సుఖ్​నగర్ నుంచి కర్ణాటకలోని బీదర్​కు వెళ్తుండగా ఎంజే మార్కెట్ వద్ద వెనక నుంచి ఓ బైక్​కు తాకగా వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు కింద పడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి గురైన యువకులు, బస్సులోకి ఎక్కి డ్రైవర్ లక్ష్మయ్యపై దాడి చేశారు. 

Police Arrest Two Youth for attack on RTC Driver and Conductor : అడ్డుకోవడానికి వెళ్లిన కండక్టర్ అంజమ్మపై సైతం దాడికి పాల్పడ్డారు. వెంటనే అక్కడి నుంచి యువకులు బైక్​పై పరారయ్యారు. డ్రైవర్, కండక్టర్​కు గాయాలవ్వడంతో బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులు వంశీ, రాహుల్​ను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. మరొక యువకుడు అనిరుధ్ పరారీలో ఉన్నట్లు బేగంబజార్ సీఐ విజయ్ కుమార్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.