అనంత జిల్లాలో కూలిన మట్టి మిద్దె - ముగ్గురికి తీవ్ర గాయాలు, చిన్నారి సేఫ్​ - House Collapsed Three injured - HOUSE COLLAPSED THREE INJURED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 12:33 PM IST

House Collapsed and Three injured in Anantapur Ditsrict : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం బోడిసానిపల్లిలో మట్టి మిద్దె కూలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఉయ్యాలలో నిద్రిస్తున్న పాప సురక్షితంగా బయటపడింది. మిద్దెపై గడ్డి తొలగిస్తుండగా ఒక్క సారిగా అది కుప్పకూలింది. దీంతో మిద్దెపై ఉన్న వారు కింద పడ్డారు. కూలిన శిథిలాల కింద ఒక వ్యక్తి ఇరుక్కుపోయారు. మిద్దె మీద ఉన్నవారు ఒక్కసారిగా కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన శిథిలాలను తొలగించి గాయపడిన వారిని గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి, ఆసుపత్రిలో బాధితులను పరిశీలించి వివరాలు సేకరించారు. ఘటనపై ఎస్పీ జగదీష్ ఆరా తీశారు.

గత వారం రోజులుగా కురిసిన వానలకు అనంతపురం జిల్లా తడిసి ముద్దయింది. వాగులు, వంకలు పొంగిపోయాయి. ఈ క్రమంలో మట్టి మిద్దెలు మెత్తబడి కూలిపోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.