కువైట్ అగ్నిప్రమాదం - రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు - AP People in Kuwait fire - AP PEOPLE IN KUWAIT FIRE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 3:25 PM IST
Three Dead Bodies of AP Were Brought to Their Native Villages in Kuwait Fire : కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. అగ్ని ప్రమాదంలో తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు చనిపోయారు. ఈ ముగ్గురి మృతదేహాలను మొదట విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. మృతదేహాలకు బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు తరలించారు.
అయితే కువైట్ లోని ఆల్ మంగాఫ్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకున్నాయి. భారత వాయుసేన (IAF) కు చెందిన ప్రత్యేక విమానం మృతదేహాలతో తొలుత కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకుంది. అధేవిధంగా దుర్మరణం పాలైన భారత కార్మికుల కుటుంబాలకు రూ.8 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కువైట్‌కు చెందిన ఎన్బీటీసీ సంస్థ ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున అందిస్తామని వెల్లడించింది.