ఒక్క రూపాయి కూడా లేదని కెమెరా ముందు దొంగ దండాలు - వైరలవుతున్న వీడియో - Variety Thief at Maheshwaram - VARIETY THIEF AT MAHESHWARAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 9:34 AM IST
Variety Thief at Maheshwaram : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో చోరీకి పాల్పడిన ఓ విచిత్ర దొంగ హంగామా చేశాడు. జులై 18న మహేశ్వరం పీఎస్ పరిధిలో ఎంఆర్‌వో ఆఫీస్ సమీపంలో ఉన్న వినాయక మెస్‌లో దూరాడు. ప్రధాన ద్వారాన్ని విరగ్గొట్టి లోపలికి వెళ్లిన దొంగకు అక్కడ ఏమీ దొరకలేదు. దీంతో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా ముందుకు వచ్చి సైగలు చేశాడు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా లేదంటూ దండం పెట్టాడు. పైసా కూడా లేదేంట్రా బాబు అంటూ అసహనానికి గురయ్యాడు.
అంతా కలియదిరిగి దాహం వేయడంతో అక్కడే ఉన్న ఫ్రిడ్జ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. డబ్బులు కూడా ఇస్తానని, బాటిల్ ఖర్చు 20 రూపాయలు అక్కడ పెట్టి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. దీంతో ఈ వీడియో చూసిన వాళ్లంత తెగ నవ్వుకుంటున్నారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.