ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల వినతి - Telangana Employees Request to Govt - TELANGANA EMPLOYEES REQUEST TO GOVT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-07-2024/640-480-21868133-thumbnail-16x9-telangana-employees-request-to-ap-govt.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 4:32 PM IST
TELANGANA EMPLOYEES REQUEST TO AP GOVT: ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు, తమను సొంత రాష్ట్రానికి పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది తెలంగాణ ఉద్యోగులు పని చేస్తున్నట్టు వెల్లడించారు. సచివాలయం, హెచ్వోడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు.
సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని, తమను తమ రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. విభజన జరిగి పదేళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఉద్యోగులు అభ్యర్థిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో తమ అంశంపై చర్చించాలని కోరారు. ఈ నెల 6 తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై చర్చించనున్నారు.