ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోలు బాంబుతో దాడి - ఒకరు అరెస్ట్, మరొకరు పరారీ - Petrol Bomb Attack in TEACHER HOUSE - PETROL BOMB ATTACK IN TEACHER HOUSE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 10:43 AM IST

Teacher House Attacked With Petrol Bomb: ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జంగం నర్సాయిపల్లిలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోలు బాంబుతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా దాడి తానే చేశానని నిందితుడు చెప్పినట్లు డీఎస్పీ తెలిపారు. ఇటీవలే వాలంటీర్​గా రాజీనామా చేసిన ఆనంద్ బాల మరొకరితో కలిసి ఉపాధ్యాయుడు నారాయణను హత్య చేసేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. అందుకే పెట్రోలు బాంబుతో దాడి చేశారన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రెహమాన్ కోసం గాలిస్తున్నట్లు వివరించారు. 

ఉపాధ్యాయుడు నారాయణకు, అదే గ్రామానికి చెందిన కటుకూరి అనంత బాల, రహీంలకు 2020లో కొవిడ్‌ సమయంలో గొడవలు తలెత్తాయి. అప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ నెల 28న వారిని అంతమొందించాలని మూడు ఖాళీ బీరు సీసాల్లో పెట్రోల్‌ నింపి నిప్పంటించి ఒక బాటిల్‌ను నారాయణ నిద్రిస్తున్న మంచం వైపు విసిరారు. అది గేటుకు తగిలి కిందపడటంతో భయపడి నిద్ర లేచిన నారాయణ కుటుంబం కేకలు వేయడంతో మిగిలిన రెండు బాటిళ్లు రోడ్డుపై వదిలేసి నిందితులు పరారయ్యారు. పాతకక్షలతోనే దాడికి యత్నించారని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.