'జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తున్నారు' - బుద్దా వెంకన్నతాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 1:51 PM IST
TDP Senior Leader Buddha Venkanna Comments on Kesineni Nani : సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అని ఆయన స్పష్టంచేశారు. కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పారని అన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రానప్పుడు, తనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా జరిగారని తెలిపారు.
కేశినేని నాని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడని చేశాడని బుద్దా వెంకన్న విమర్శించారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడమంటే గోడకు కొట్టిన సున్నం లాంటిదేనని తెలిపారు. కేశినేని నానిని రోడ్ల మీదకు వదిలేటప్పుడు అతని అప్పులను జగనే తీర్చాలన్నారు. కేశినేని నాని వెనుక జగన్ లాగా సొంత తల్లి, చెల్లీ కూడా లేరని బుద్దా వెంకన్న విమర్శించారు.