రాబోయో ప్రభుత్వాల అప్పులను కూడా జగన్మోహన్ రెడ్డే చేస్తున్నారు: యనమల - Yanamala Ramakrishnudu - YANAMALA RAMAKRISHNUDU
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 5:15 PM IST
Yanamala Rama krishnudu about YSRCP Debts: జగన్మోహన్రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ ఆర్బీఐ నుంచి 4 వేల కోట్లు అప్పులు తెచ్చారని మండిపడ్డారు. 2023 - 24లో ఆర్బీఐ నుంచే కేవలం మంగళవారం అప్పులే 70 వేల కోట్లు చేసారని ధ్వజమెత్తారు.
జగన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు 257 కోట్లు చొప్పున మొత్తం 93,805 కోట్లు అప్పులు చేసిందని దుయ్యబట్టారు. శాసనసభకు చెప్పి చేస్తామన్న అప్పులు ఇవి రెండింతలు ఎక్కువని విమర్శించారు. రాబోయే ప్రభుత్వాల అప్పులను సైతం జగన్ రెడ్డే చేయాలనుకుంటున్నాడని యనమల ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ ఉండగానే 2024-25 ఆర్ధిక సంవత్సరం అప్పులలో రూ.20 వేల కోట్లు జూన్ 4 లోపే చేసేయాలని కేంద్రం నుంచి అప్పుల సమీకరణకు అనుమతులు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆర్ధిక అధోగతి పాలుకాకుండా కాపాడుకోవాలంటే జగన్ రెడ్డిని ఓడించాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పులతో కొనసాగే సంక్షేమ రాజ్యం ఎప్పటికైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. పేదలను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించాలంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం అందించే కూటమిని గెలిపించాలని యనమల సూచించారు.