జగన్ ప్రభుత్వం నాసిరకం మద్యమే కాదు-కలుషిత తాగునీరు కూడా సరఫరా చేస్తోంది: నక్కా ఆనంద్‌బాబు - CM Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 1:13 PM IST
TDP Nakka Anand Babu on Diarrhea Cases in AP: ఏపీలో నాసిరకం మద్యమే కాదు కలుషిత తాగునీరును కూడా సరఫరా చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ఈ కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున డయేరియా కేసులు నమోదవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతోంటే మంత్రి విడదల రజనీ((Minister Vidadala Rajini) చోద్యం చూస్తూ కూర్చొన్నారని మండిపడ్డారు.
Nakka Anand Babu Fire on YSRCP Govt: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే దాకా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోరా? అని నిలదీశారు. స్థానిక సంస్థల నిధులు, తాగునీటి(Drinking Water) కోసం కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించడం వల్లే ఈ సమస్యలని ఆరోపించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ మొక్కుబడి సమీక్షలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. తాగడానికి మంచి నీళ్లివ్వలేని ప్రభుత్వం.. ఓట్లడగడానికి మాత్రం వస్తోందని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.