జగన్ 144 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు: కనకమేడల - Kanakamedala Ravindra on CM Jagan - KANAKAMEDALA RAVINDRA ON CM JAGAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 1:20 PM IST

MP Kanakamedala Ravindra fire on CM Jagan: సీఎం జగన్ అధికారంలోకి రాకముందు మోసపూరిత వాగ్దానాలు చేశారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్(TDP MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక 144 హామీలు అమలు చేయకుండా మడమ తిప్పారని మండిపడ్డారు. వివేకా హత్య పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు మరో కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసన్నారు. జగన్​ను ప్రజలను నమ్మరని గద్దె దింపటానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 

సంక్షేమానికి మారుపేరు నందమూరి తారకరామారావు అని కొనియాడారు. పాలనలో ఎన్టీఆర్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం చరిత్రలోనే ఓ విప్లవాత్మక నిర్ణయం అని అన్నారు. రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి టీడీపీ నాంది పలికిందని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పాలన చేసి ప్రజలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం కీలక పాత్ర వహించిందని కనకమేడల అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.