ఏలూరును అభివృద్ధే నా లక్ష్యం- టీడీపీ నేత పుట్టా మహేశ్ యాదవ్ - MP Candidate Putta Mahesh Yadav - MP CANDIDATE PUTTA MAHESH YADAV
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 8:35 PM IST
TDP MP Candidate Putta Mahesh Yadav Meeting in Eluru District : ఏలూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ వెల్లడించారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఏలూరు చేరుకున్న ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహేష్ యాదవ్కు ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలతో ఏలూరు అభివృద్ధి ప్రణాళికల గురించి చర్చించారు.
ఏలూరు పార్లమెంటుపై ఆరు నెలలుగా దృష్టి సారించానని, ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని పుట్టా మహేశ్ యాదవ్ పేర్కొన్నారు. అందరికీ నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఏలూరు ప్రజలు తనను ఆశీర్వదిస్తే ఇక్కడి సమస్యలకు పరిష్కారం చూపుతానని మహేష్ స్పష్టం చేశారు. స్థానికేతరుడు, కుటుంబ రాజకీయం అనే విషయాలు పక్కన పెడితే ఏలూరు సీటు గెలవడంపైనే తన దృష్టి ఉందని పేర్కొన్నారు. సీనియర్లు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లి విజయం సాధించే దిశగా కృషి చేస్తానన్నారు.