టీడీపీ 'హోరెత్తిన ప్రజాగళం' పాట ఆవిష్కరణ - శ్రేణుల్లో ఉత్సాహం - Prajagalam Song launched in hyd - PRAJAGALAM SONG LAUNCHED IN HYD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 7:06 PM IST
TDP Leaders Launched Prajagalam Song : రాష్ట్రంలో ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్దమయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో తలపడనున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ శ్రేణులలో ఉత్సాహన్ని నింపడానికి రూపొందించిన 'హోరెత్తిన ప్రజాగళం' గీతాన్ని తెలుగుదేశం నేత మురళీమోహన్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు టీడీ జనార్దన్, జోస్న తదితరులు పాల్గొన్నారు. కోనేరు ప్రదీప్ కుమార్ దర్శకత్వంలో పొట్లూరి శ్రీనివాస్ ఈ పాటను నిర్మించారు.
Praja Galam Song Launched Program : ఈ సందర్బంగా మాట్లాడిన మురళీ మోహన్, గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనంలో జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అనేది లేకుండా దిక్కులేని రాష్ట్రంగా తయారైందని విమర్శించారు. ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమికొట్టారని మండిపడ్డారు. వైసీపీలో కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ దోచుకున్నారన్నారు. ప్రజలకు ఉచితాలకు బదులు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.