కౌంటింగ్ రోజైనా పోలీసులు తటస్థంగా వ్యవహరించాలి: ఈసీ, డీజీపీలకు టీడీపీ లేఖ - TDP Letter to EC On Security - TDP LETTER TO EC ON SECURITY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2024, 11:21 AM IST
TDP Leaders Letter to EC On Security Arrangements of Strong Rooms & Counting Centres : స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా ఆర్వోలకు దిశానిర్దేశం చేయాలని ఈసీ, డీజీపీ (DGP)లకు మాజీ మంత్రి దేవినేని ఉమ లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమాలను ఉల్లంఘించారన్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అరాచకాలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ రూంల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. కౌంటింగ్ రోజున పోలీసు అధికారులు తటస్థ వైఖరితో విధులు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహనలో భద్రతా ప్రమాణాలు లోపించడం వల్ల జరిగిన అల్లర్లు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని కోరారు.