వాలంటీర్ల జీవితాలతో ఎమ్మెల్యే ఆడుకుంటున్నారు : టీడీపీ నేత చింతకాయల విజయ్ - TDP Leader Vijay - TDP LEADER VIJAY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 2:11 PM IST
TDP Leader Vijay Protest YCP Leader Volunteer Meeting in Anakapalli District : ఎన్నికల నేపథ్యంలో సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పదేపదే చెబుతున్నా వైసీపీ నాయకులు లెక్క చేయడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమశంకర్ గణేశ్ మంగళవారం రాత్రి నర్సీపట్నంలో వాలంటీర్లతో రహస్యంగా సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉమశంకర్ గణేశ్‌పై ఎన్నికల కమిషనర్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎమ్మెల్యే వాలంటీర్ల సమావేశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని అధికారులకు చింతకాయల విజయ్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించిన విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి రావడంతో గోడ దూకి పారిపోయడని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో నగదును పంచడానికి వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా అమాయకులైనా వాలంటీర్లపై చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.