దళితల సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్​కు ఓటేయొద్దు : వర్ల రామయ్య - Varla Ramayya Comments on YCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 5:55 PM IST

TDP Leader Varla Ramayya Fire on YCP Government : దళితులను ఇబ్బంది పెట్టిన రాక్షస పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. 'దళితులారా మేల్కోండి' అనే కరపత్రాన్ని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ ఎస్సీ నేతలతో కలసి వర్ల రామయ్య ఆవిష్కరించారు. దళితును నమ్మించి మోసం చేసి జగన్‌ గద్దెనెక్కారని వర్ల రామయ్య విమర్శించారు. రూ. 38 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని వర్ల మండిపడ్డారు. 

దళితలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసి వాళ్ల సంక్షేమాన్ని తుంగలో తొక్కారని ఆయన దుయ్యబట్టారు. దళితుడిని చంపేసి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు మద్దతిచ్చిన జగన్​కు ఓటు వేయవద్దని వర్ల రామయ్య పేర్కొన్నారు. దళితుల శ్రేయస్సు కోసం చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ కమిషన్ తీసుకువస్తే దానిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన తెలిపారు. దళితుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని వర్ల రామయ్య పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వర్ల రామయ్య అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.