LIVE: విశాఖ భూముల వివాదంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Varla Ramaiah Press Meet LIVE
🎬 Watch Now: Feature Video
LIVE : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆయన కుమారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను మే 20వ తేదీన పరిశీలించాక, త్రిలోక్ ముఠా వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నవరం, తూడెం గ్రామ రైతులు ఆరోపించారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్‌తో కలిసి విశాఖలోని టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చిందని చెప్పినా వినకుండా మే 30న భూములు ఆక్రమించి ఫెన్సింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించగా, ప్రతిఘటించినట్లు బాధిత రైతులు వివరించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. తమ ప్రాణాలు పోయినా దశాబ్దాలుగా సాగు చేసుకున్న భూములను వదిలేదిలేదని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం, వారితో వచ్చిన స్థానిక వైసీపీ నాయకులు వెనుదిరిగారన్నారు. 1991 నుంచి భూమి శిస్తు రశీదులతోపాటు, రికార్డుల్లో పేర్లు ఉన్నాయని నీలగిరి, జీడి, మామిడి, సరుగుడు, కొబ్బరి సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. భోగాపురం, తూడెం చుట్టు పక్కల గ్రామాల్లో పలువురు అన్నదాతల నుంచి భూముల కొనుగోలుకు సీఎస్ బినామీ త్రిలోక్ అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు తూడెం, అన్నవరం రెండు పంచాయతీలు విశాఖ జిల్లాలో ఉండేవని, ప్రస్తుతం విజయనగరం జిల్లాకు తూడెం, విశాఖ జిల్లాకు అన్నవరం వెళ్లాయని తెలిపారు. విశాఖ భూములపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Jun 1, 2024, 1:38 PM IST