వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిన కాకాణికి రైతుల కష్టాలేం తెలుసు? : సోమిరెడ్డి - Somireddy fires on kakani govardhan
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 5:10 PM IST
TDP leader Somireddy Chandramohan Reddy Fires On Kakani: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కాకాణి తన స్థాయికి తగ్గట్లే మాట్లాడాలని సోమిరెడ్డి నెల్లూరులో హితవు పలికారు. నెల్లూరు జిల్లా దాటి వ్యవసాయంపై ఒక్క సమీక్ష చేయని కాకాణికి రైతుల కష్టాలు ఏమి తెలుసని నిలదీశారు. ఆర్బీకేలను రైతు భక్షక కేంద్రాలుగా మార్చారని దుయ్యబట్టారు.
రైతులకు పరికరాలు, ధాన్యం తడిసిపోకుండా కప్పేందుకు ఒక బరకం ఇవ్వలేని కాకాణి సవాళ్లు విసరడం సిగ్గుచేటని సోమిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన రా కదలిరా సభ దిగ్విజయమైందని, ప్రజలు చంద్రబాబుకు నీరాజనాలు పలికారని చెప్పారు. కంటి సమస్యలున్న కాకాణికి మాత్రం జనం కనిపించలేదని దుయ్యబట్టారు. అక్రమాస్తుల కేసులో కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు మీటింగ్ అంటే ప్రజల మీటింగ్, జగన్ మీటింగ్ అంటే వాలంటీర్, సచివాలయ సిబ్బంది అని సోమిరెడ్డి విమర్శించారు.