సాక్షి పత్రికకు పరువునష్టం నోటీసులు- అసత్య కథనాలు ప్రచురించారని పెమ్మసాని మండిపాటు - Pemmasani Notices to Sakshi - PEMMASANI NOTICES TO SAKSHI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 3:58 PM IST
TDP Leader Pemmasani Sent Defamation Notices to Sakshi: సాక్షి దినపత్రికకు గుంటూరు తెలుగుదేశం లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (TDP Loksabha Candidate Pemmasani chandra sekhar) పరువు నష్టం నోటీసులు పంపారు. రాజకీయ దురుద్దేశంతో తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగేలా సాక్షి దినపత్రిక (Sakshi News paper) వార్తలు ప్రచురించిందని పేర్కొన్నారు. ఇందుకు భేషరతుగా క్షమాణలు చెప్పాలని నోటీసుల్లో ఆయన డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం కింద రూ.100 కోట్లు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
తాను అనని మాటల్ని అన్నట్లు కుట్ర పూరితంగా తప్పుడు వార్తలు రాసి లోకేశ్‌తో తనకు విభేదాలు సృష్టించాలని చూశారని పెమ్మసాని ఆరోపించారు. అలాగే తాను పెద్ద మొత్తంలో డబ్బులు వ్యయం చేస్తున్నానని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) దృష్టికి వెళ్లేలా ఆ పత్రిక ఉద్దేశపూర్వకంగా వార్తలు రాస్తోందని ఆయన పేర్కొన్నారు. నోటీసులకు 10 రోజుల్లో స్పందించాలని లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.