ఎమ్మెల్యే కేతిరెడ్డి ఐదేళ్ల పాలనలో అన్నీ అవినీతి, అక్రమాలే: పరిటాల శ్రీరామ్ - Dharmavaram MLA Kethireddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 10:40 AM IST

TDP Leader Paritala Sriram Allegations on MLA Kethireddy Venkataraman Reddy : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు అధికమయ్యాయని తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ విమర్శలు చేశారు. ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అక్రమాలపై శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మండలం రేగాటపల్లి వద్ద సొసైటీ భూములు నాడు 900 ఎకరాలు పరిటాల రవీంద్ర పేదలకు పంచారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డి భూ పంపిణీలో అక్రమాలకు తెరతీసారని ఆరోపించారు. 

Land Grabbing in Dharmavaram : ఎమ్మెల‌్యే బినామీలకు వారి కుటుంబ సభ్యులకు భూములు కేటాయించారని పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. నియోజవర్గంలో ఉపాధి హామీ పథకం మొదలు ఇళ్ల పట్టాలు తదితర వాటిల్లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని శ్రీరామ్ ఆరోపించారు .ఇప్పటికే ధర్మవరం తహసిల్దార్‌తో పాటు ఇద్దరు వీఆర్వోలు సస్పెండ్ అయ్యారన్నారు పోలీసులు ఎమ్మెల్యే మాట విని తెలుగుదేశం పార్టీ వర్గీయులపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు అధికారులు నిబంధనలు విరుద్ధంగా పని చేస్తే వారిపై విచారణ తప్పదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.