LIVE: మద్యపాన నిషేధం పేరుతో లక్ష కోట్లు దోపిడీ - కూటమి నేతల మీడియా సమావేశం - bonda uma media conference

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 11:08 AM IST

Updated : Apr 11, 2024, 11:36 AM IST

TDP Leader Bonda Uma Media Conference: మద్యపాన నిషేధం పేరుతో ఐదేళ్లలో అధికార వైసీపీ లక్ష కోట్ల దోపిడీ చేసిందని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం హామీని తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి లెక్కలు, పత్రాలపై ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్, మద్యం ద్వారా వచ్చే ఆదాయన్ని చూపిస్తూ 15 ఏళ్లకు బ్యాంకు నుంచి అప్పులు తెచ్చారని ధ్వజమెత్తారు.టీ స్టాల్ దగ్గర నుంచి, కిళ్ళీ కొట్టు వరకు అన్నిచోట్ల డిజిటల్ పేమెంట్ ప్రపంచం నడుస్తుందని కానీ, ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ కు నో ఛాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుందని, వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా ప్రశ్నిస్తున్నారు. ఇంత విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మి, పేదోడిని దోపిడీ చేసిన ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్ర తిరగేసినా దొరకరేమో అంటూ విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం పేరుతో దోపిడీపై ప్రస్తుతం టీడీపీ నేత బొండా ఉమా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Apr 11, 2024, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.