వలస పక్షులకు కొండెపివాసులు మద్దతివ్వరు: డోలా బాల వీరాంజనేయ స్వామి - Dola Bala Veeranjaneya Swami - DOLA BALA VEERANJANEYA SWAMI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 12:30 PM IST

TDP Leader Dola Bala Veeranjaneya Swami Comment on YSRCP Candidate : వలస పక్షులను కొండెపి ప్రజలు తిప్పి కొడతారని ప్రకాశం జిల్లా కొండెపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, కూటమి ఉమ్మడి అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కొండెపి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే తమ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నాయకులు లోకేశ్​లు ప్రణాళికతో ఉన్నారని వెల్లడించారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఇలా వచ్చి, అలా వెళ్లి పోతారని వ్యాఖ్యానించారు. పక్క నియోజక వర్గం నుంచి తరిమి కొడితే ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నారంటూ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి ఆదిములపు సురేష్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీకి మూడో సారి విజయం అందించడానికి కొండెపి ప్రజలు సిద్దంగా ఉన్నారంటున్న బాల వీరాంజనేయ స్వామితో ఫేస్​ టు ఫేస్​. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.