LIVE: సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - devineni uma media conference live - DEVINENI UMA MEDIA CONFERENCE LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 12:08 PM IST

Updated : May 30, 2024, 12:24 PM IST

Devineni Uma Media Conference Live :  సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో అడుగడుగునా అక్రమాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ కౌంటింగ్‌ రోజునా అదే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ నాయకుల వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దానికి ఊతమిస్తున్నాయి. రూల్‌ కాదని వెనెక్కి తగ్గేవారు తమ కౌంటింగ్‌ ఏజెంట్‌గా వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్లకు కొన్ని మార్గదర్శాకాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. అందులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. వారనుకున్నట్లుగా అడ్డం కొట్టకుండా ఆపేందుకు ఏమేం రూల్‌ పొజిషన్‌ ఉన్నాయో చూసుకోవాలని సజ్జలు వ్యాఖ్యానించారు.సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం
Last Updated : May 30, 2024, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.