ఓట్ల అక్రమాలపై టీడీపీ నేత ఫిర్యాదు- ఒకే నియోజకవర్గంలో 2,200 డబుల్‌ ఎంట్రీలు - ఓట్ల అక్రమాలపై టీడీపీ నేత ఫిర్యాదు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 10:28 AM IST

Updated : Feb 7, 2024, 1:17 PM IST

TDP Leader Complained to Irregularities of Voter List: ఓటర్ల జాబితాలో అవకతవకలు సవరించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. తెలుగుదేశం నేతలు అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి మున్సిపల్‌ కమిషనర్‌కు ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో దాదాపు 2,200 డబుల్‌ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 15 లోపు ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారులకు ఆయన డెడ్‌ లైన్‌ పెట్టారు. 

మూడు వారాల క్రితం 16వ డివిజన్లో 14 పేర్లు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, కమిషనర్​ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, మృతుల వివరాలను సరిచేసి జాబితా విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతానని వెల్లడించారు. ఓట‌ర్ వెరిఫికేష‌న్​పై తాము ప్ర‌త్యేక దృష్టి పెట్టామని నాారాయణ తెలిపారు. నిస్ప‌క్ష‌పాతంగా ఓటరు జాబితాను విడుదల చెయ్యాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. 

Last Updated : Feb 7, 2024, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.