జరుగు జగన్ జరుగు- ఎన్నికల వేళ టీడీపీ సరికొత్త పాట! - TDP release special video song - TDP RELEASE SPECIAL VIDEO SONG
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 8:13 PM IST
TDP Leader Chandrabau Release Special video Song: రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు సరికొత్త పాటలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జరుగు జగన్ జరుగు అంటూ తెలుగుదేశం పార్టీ సరికొత్త వీడియోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజా ప్రభుత్వం రాబోతోందనీ జగన్‌ను పక్కకు పంపేందుకు సమయం వచ్చిందంటూ రూపొందించిన ఈ పాటను టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు ఎక్స్ వేదికగా విడుదల చేశారు.
టీడీపీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. దీని ద్వారా టీడీపీ అభిమానులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా రూ.99,999 రూపాయల విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందజేశారు. ఎన్‌ఆర్‌ఐల కోసం కూడా ఈ వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించినట్లు తెలిపారు. విరాళాలు ఇచ్చిన వారికి రశీదులు కూడా ఇస్తామని పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ చాలా సులువు అవుతుందని చంద్రబాబు తెలిపారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందని గుర్తు చేశారు.