ప్రమాణ స్వీకారం చేసిన మోదీ, కేబినెట్ మంత్రులు - శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు ట్వీట్‌ - CBN congratulated Modi on his third term PM - CBN CONGRATULATED MODI ON HIS THIRD TERM PM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 8:56 AM IST

TDP Leader Chandrababu Tweet Congratulations to PM Modi: భారత ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోదీకి అభినందనలు తెలిపారు. వికసిత్ భారత్ దార్శనికతకు అంకితమైన తన పదవీకాలం విజయవంతంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వారి పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

ప్రమాణ స్వీకారం వేడుక మన దేశ అభివృద్ధి, శ్రేయస్సుతో పాటు కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు  వెల్లడించారు. చంద్రబాబు సైతం ఈ నెల 12న ఉదయం 11.27గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు అధికారికంగా తెలిపాయి. ఇప్పటికే కేసరిపల్లిలోని ఐటీ పార్క్​ సమీపంలో పన్నెండు ఎకరాలలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్​, జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.