పింఛన్లు పంపిణీ చేయాలని సీఎస్‌ను కోరిన చంద్రబాబు- ఈసీ ఎటువంటి ఆంక్షలు విధించలేదని వెల్లడి - CBN ask CS To Distribute Pensions - CBN ASK CS TO DISTRIBUTE PENSIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 12:27 PM IST
TDP Leader Chandrababu asked CS to Distribute Pensions: రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని (Jawahar Reddy) తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా కోరారు. ఈ మేరకు సీఎస్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు విధించలేదని జవహర్‌రెడ్డికి తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు వారి ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పింఛన్ పంపిణీ చేపట్టాలని అన్నారు. సచివాలయం ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టాలని కోరారు.
సీఎస్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్‌తో (CEO Mukesh Kumar Meena) చంద్రబాబు ఫోన్‌లో సంభాషించారు. ప్రజలకు వెంటనే పింఛన్ల అందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పింఛన్ల విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు తెలుగుదేశం పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తగిన చర్యలు తీసుకోవాలి ఆయన విజ్ఞప్తి చేశారు.