వైఎస్సార్సీపీ నేతలందరూ కబ్జాలు, అక్రమాలు చేసేవారే : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి - TDP Leader Byreddy Rajasekhar Reddy - TDP LEADER BYREDDY RAJASEKHAR REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 3:15 PM IST
TDP Leader Byreddy Rajasekhar Reddy Comments On MP Shabari Success : నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడం గర్వకారణమని నంద్యాల టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. తమ కూమార్తె బైరెడ్డి శబరి ఎంపీ (MP) గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కబ్జాలు, అక్రమాలు చేసిన కోటీశ్వరులే అని విమర్శించారు. రౌడీ మూకలతో నంద్యాలను నాశనం చేసిన వైఎస్సార్సీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నంద్యాల ప్రజలు భయపడవద్దని తాము ఉన్నామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తామ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశరు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చెయ్యడమే వారి ప్రధాన లక్ష్యమని, వైఎస్సార్సీపీ అరాచకాలకు ఇక బ్రేకులు పడ్డట్టేనని ధ్వజమెత్తారు.