పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు: టీడీపీ నేత అయ్యన్న - TDP Leader Ayyannapatradu - TDP LEADER AYYANNAPATRADU
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 11:47 AM IST
TDP Leader Ayyannapatradu Comment Postal Ballot Narsipatnam Visakha District : రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియలో అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పోస్టల్ బ్యాలట్ నర్సీపట్నం ఆర్డీఓ, రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఉపాధ్యాయులు, అంగన్ వాడీలు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం తట్టుకోలేని కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారని అయ్యన్న ఆరోపించారు. నర్సీపట్నంలోని ఉద్యోగులు 13ఎ డిక్లరేషన్ ఫారంలోని వివరాలను అడిగితే అధికారులు స్పందిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఓటు చెల్లుబాటు కాకుండా ఉండడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రజల పాలిట శాపంగా మారిందని, దీనిపై ఏమీ తెలియకుండా మంత్రి బొత్స మాట్లాడుతున్నారని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.