thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 10:08 PM IST

ETV Bharat / Videos

ఓట్లు అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: అచ్చెన్నాయుడు

 TDP leader Achchennaidu demanded  CBI inquiry: సీఈసీ కార్యాలయంలో దొంగలు పడ్డారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వాలంటీర్లను ఉపయోగించి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్సీపీ నేతలు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఐ- ప్యాక్ కు చెందిన ఉద్యోగులు ఓటర్ల ఆధార్ కార్డు, ఫోన్‌ నంబర్‌ ఇతర వివరాలు తస్కరించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసారు. పరిస్థితులు ఇలా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా ఎలా జరుగుతాయని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఓట్ల తొలగింపుపై రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని తెలిపారు. బీసీ జనగణన పేరుతో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరణ చేస్తున్నట్లు ఆరోపించారు. సీఎం జగన్ ఎమ్మెల్యేల బదిలీలు చేపడితే, వారు ఓటర్ల బదిలీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా రూపకల్పనలో భారీగా అవకతవకలు జరిగాయని ఈ అంశంపై  కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.