LIVE : టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన - ప్రత్యక్షప్రసారం - టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా
🎬 Watch Now: Feature Video
Published : Feb 24, 2024, 11:06 AM IST
|Updated : Feb 24, 2024, 1:15 PM IST
LIVE: రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు నేడు టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఉదయం 11 తర్వాత అభ్యర్థులను టీడీపీ - జనసేన ప్రకటించనుంది. బీజేపీతో పొత్తు అంశంపై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున, ఆ పార్టీ ఆశించే సీట్లు కాకుండా స్పష్టత ఉన్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరగనుంది.తొలి జాబితాలో 13 ఉమ్మడి జిల్లాల నుంచి అభ్యర్థులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపీ అభ్యర్థుల వెల్లడిపైనా ఇవాళ చంద్రబాబు, పవన్‌లు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అందుబాటులో ఉండాలని సీనియర్ నేతలకు అధిష్ఠానం పిలుపునిచ్చింది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు తెలుగుదేశం నేతలతో సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే అవకాశం ఉండగా, టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
Last Updated : Feb 24, 2024, 1:15 PM IST