భక్తి శ్రద్ధలతో ఉరుసు మహోత్సవం- పాల్గొన్న ఏలూరి సాంబశివరావు - Urusu Festival Celebrations - URUSU FESTIVAL CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 12:08 PM IST
Urusu Festival Celebrations in Bapatla District : బాపట్ల జిల్లా మార్టూరు లో శ్రీ హజరత్ కరీముల్లాషా వలి ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గుర్రంపై గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు దర్గా వద్ద ప్రార్ధనలు చేశారు. ఉత్సవంలో పర్చూరు తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పాల్గొని ప్రార్ధనలు చేశారు.
ప్రతి సంవత్సరం హిందూ, ముస్లిం సోదరులు సమైక్యంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తుంది. ఈ మహోత్సవాలు ప్రజల సహకారాలతో కులమతాలకతీతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గంధం, ఉరుసు మహోత్సం సందర్భంగా దర్గలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు, ఫక్కిర్ల జల్సా, దైవ ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ దైవ కార్యంలో అందరూ పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ కోరింది. మహోత్సవంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి శ్రద్దలతో దైవ సేవలే పాల్గొన్నారు.