తప్పు చేసి తప్పించుకునేందుకే ఎమ్మెల్యేల గైర్హాజరు: డోలా బాలవీరాంజనేయ స్వామి - డోలా బాలవీరాంజనేయ స్వామి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 7:07 PM IST

TDP Dola Sree Bala Veeranjaneya Swamy: స్పీకర్ అనర్హత పిటిషన్​కు తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం దుర్మార్గమని తెలుగుదేశం శాసనసభా పక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తప్పు చేసిన ఎమ్మెల్యేలు తప్పించుకునేందుకే గైర్హాజరయ్యారన్నారు. తాము ఇచ్చిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకుని వంశీ, బలరాం, గణేష్, గిరిపై స్పీకర్ వెంటనే అనర్హత వేయాలని డోలా బాలవీరాంజనేయస్వామి డిమాండ్‌ చేశారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి తర్వాత వైఎస్సార్సీపీ పంచన చేరిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌, మద్దాలి గిరిధర్‌, కరణం బలరాం, జనసేన తరపు నెగ్గిన రాపాక వరప్రసాద్‌ కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు ఇప్పుడు వైఎస్సార్సీపీ అధికారిక సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జగన్‌ మార్క్‌ పాలనకే చెల్లింది. ఈ సందర్భంగా ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే వైఎస్సార్సీపీలో చేరడంపై అప్పట్లో టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ మారిన నేతలపై చర్యలకు ఉపక్రమించాలంటూ గత కొంత కాలంగా స్పీకర్​ను కోరుతూ వస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.