Live: కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - TDP BJP Jana Sena Manifesto - TDP BJP JANA SENA MANIFESTO
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 2:08 PM IST
|Updated : Apr 8, 2024, 2:19 PM IST
TDP BJP Jana Sena Manifesto Committee live: తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం - టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా తెలుగుదేశం, జనసేన ఇప్పటికే మేని ఫెస్టో రూపొందించినప్పటీకీ తాజాగా కుటమిలో బీజేపీ సైతం చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభిప్రాయలను పరిగణలోకి తీసుకోవడానికి మరోమారు టీడీపీ, బీజేపీ జనసేన నేతలతో కూడిన ఉమ్మడి మేని ఫెస్టో కమిటీ భేటీ అయ్యింది. ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా తెదేపా నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్‌లను పార్టీలు నియమించాయి. జనసేన-తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున వాటికి అదనంగా మరికొన్ని జోడించి కమిటీ తుది మేనిఫెస్టోను రూపొందించనుంది.
Last Updated : Apr 8, 2024, 2:19 PM IST