ఖనిజ సంపదను వైఎస్సార్సీపీ దోచేసింది- అక్రమార్కులకు పోలీసులు సహకరించారు - Tapal Shyamprasad Interview
🎬 Watch Now: Feature Video
Tapal Shyamprasad Interview on Obulapuram Mining Case: వైఎస్సార్సీపీ హయాంలో ఖనిజ సంపద యథేచ్ఛగా దోపిడీకి గురైందని టపాల్ శ్యాంప్రసాద్ ఆరోపించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ సీజ్ చేసిన 2 లక్షల టన్నుల ఇనుమును అక్రమంగా విక్రయించినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలపై పోరాటం చేస్తున్నందుకు జగన్ తనను అన్నివిధాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులకు పోలీసులు సహకరించారని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కర్నీ వదలేది లేదని శిక్షపడే వరకు పోరాడుతానంటున్న టపాల్ శ్యాంప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి.
"ఓఎంసీలో.. సీబీఐ సీజ్ చేసిన 2 లక్షల టన్నుల ఇనుమును దోచుకున్నారు. వైఎస్సార్సీపీ అండతో వాహనాలను తుక్కుగా మార్చి అమ్మేసుకున్నారు. ఓఎంసీ నుంచి ఇనుము తరలిపోతున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలపై పోరాడుతున్నానని అక్రమ కేసులతో నన్ను ఇబ్బంది పెట్టారు." - టపాల్ శ్యాంప్రసాద్, ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన సాక్షి