జగన్‌ను గెలిపించినందుకు నట్టేట ముంచారు: తాడేపల్లి అపర్ణ అపార్టుమెంటు వాసులు - Alla Ramakrishna Reddy - ALLA RAMAKRISHNA REDDY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-04-2024/640-480-21117741-thumbnail-16x9-ycp-leader-campaign.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 11:51 AM IST
Tadepalli Aparna Apartment People Protest to YCP Leaders in Guntur District : గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సొంత పార్టీ నాయకులే విమర్శనాస్త్రాలు సంధించారు. తాడేపల్లి అపర్ణ అపార్టుమెంటు వాసుల ప్రశ్నలకు వైసీపీ నాయకుడు ఇరకాటంలో పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యతో కలసి ఎమ్మెల్సీ హనుమంత రావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను నిలదీశారు.
గత ఎన్నికల్లో సీఎంగా జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఆర్కేను గెలిపించినందుకు నట్టేట ముంచారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రాజధాని అని ఆడిన డ్రామాతో తాము ఎంతగా నష్టపోయామో అంకెలతో సహా వివరించారు. అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక ఐటీ పరిశ్రమ కూడా రాలేదని మండిపడ్డారు. అభివృద్ధి లేక తీవ్రంగా నష్టపోయి, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నామని ధ్వజమెత్తారు. ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని ఎలా నమ్మాలంటూ వేదికపై ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని కడిగిపారేశారు.