రాజకీయాల ద్వారా కూడా ప్రజలకు సేవ చేయవచ్చు : పరిపూర్ణానంద స్వామి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 10:54 PM IST

Swami Paripoornananda Speech in Hindupur : రాజకీయాల ద్వారా కూడా ప్రజలకు సేవ చేయవచ్చని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండల కేంద్రంలో చౌడేశ్వరి దేవి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా పరిపూర్ణానంద స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ,చౌడేశ్వరి దేవి ఆలయం విశిష్టత ప్రజలందరికీ తెలుసున్నారు. అలాగే రాజకీయాలలో హిందూపురం నుంచి బీజేపీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తుందని నమ్మకంతో రాజకీయాలలో వస్తున్ననని తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన హిందూపురంలో ఎంపీగా గెలుపొంది నియోజక అభివృద్ధికి కృషి చేయాలని ఉందని వెల్లడించారు. హిందూపురంలో తొందరలో మెగా జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. 

హిందూపురం లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు శ్రీపీఠం వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. దక్షిణాదిలో హిందూపురం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతమని పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందూపురం అంటే హిందూ అని పేరులోనే ఉన్నదని, అందుకే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అందుకే ఆ పార్టీ తరపున బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.